అపార్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి……
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం.
కంభం: మండలంలో పాఠశాల విద్యార్థుల అపార్ నమోదు ప్రక్రియను వేగవంతంగా, త్వరితగతిన పూర్తి చేయాలని ఎంఈవో-2 టి.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం స్థానిక వాసవి విద్యానికేతన్, ఆల్ఫా, గౌతమ్ స్కూల్ తదితర ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో అపార్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులందరికీ ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ(అపార్) నమోదు తప్పనిసరిని, తల్లిదండ్రుల ధ్రువీకరణతో విద్యార్థులందరికీ అపార్ ఐడీలను నమోదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీఆర్పీలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App