TRINETHRAM NEWS

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా పైన టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు.

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి ఆదేశాలమేరకు జిల్లాలోని అక్రమ రవాణాఅసాంఘికకార్యకలాపాలపైన దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఇటీవల జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులుదాడులు నిర్వహించినవివరాలుక్రిందివిధంగా ఉన్నాయి. జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం అధికారులు వికారాబాద్ టౌన్ PS పరిధిలోని మధుగుల చట్టంపల్లి గ్రామ శివారులో పేకాట ఆడే వారిని అదుపులోకి తీసుకోని 06 మంది సభ్యులను పట్టుకొని పేకాట లో గల ₹ 21,570/- రూపాయలు డబ్బులు,4 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకొని వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసునమోదుచెయడంజరిగింది.వికారాబాద్ పిఎస్ పరిధిలోని సూర్యప్రకాష్ కాలనీలో ఆటో ట్రాలీలలో అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న 2 వ్యక్తులను జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకొని వారి నుండి మొత్తం (7.8) క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకొని PDS బియ్యన్ని తరలిస్తున్నా 2 ఆటోలను సీజ్ చేసి వికారాబాద్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.
మరియు జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం యాలాల్ PS పరిమితులలోని మార్కండేయ కాలనీలో పేకాట ఆడుతున్న వారిపైన దాడి చేసి పేకాట ఆడుతున్న 07 సభ్యులను పట్టుకోవడం జరిగింది. పేకాట ఆడుతున్న ₹ 16,120/- రూపాయలు,మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకొని యాలాల్ పీఎస్‌లో కేసు నమోదు చేయడం జరిగింది.జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగిన, ఇసుక, PDS బియ్యం అక్రమ రవాణా లు కఠినమైన చర్యలుతీసుకోవడంజరుగుతుంది. అక్రమ రవాణాలు, అసాంఘిక కార్యకలాపాల గురించి టాస్క్ ఫోర్స్అధికారులకుసంప్రదించడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు సెల్ నెంబర్ 8712670022 ద్వారా సంప్రదించాలని జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి తెలియజేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App