Trinethram News : స్థానిక తేజ టాలెంట్ స్కూల్ యందు 2023-24 సంవత్సరానికి గాను నిర్వహించిన వివిధ పోటీలకు సంబంధించిన బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తేజ ఫౌండర్ డైరెక్టర్ సోమిరెడ్డి గారు, ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈవో ఎస్.ఎస్ రావు, పాఠశాల డైరెక్టర్ జానకిరామయ్య పాల్గొన్నారు. ఎస్.ఎస్ రావు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య ను అందించడంలో తేజ విద్యాసంస్థలు ముందు ఉన్నట్లుగా చెప్పారు. విద్యార్థులు ఇష్టపడి ,కష్టపడి చదువుకొని భవిష్యత్తును బాటలు వేయాలని తెలియజేశారు. పుస్తక ప్రపంచానికి బయట అనేక విషయాలను బోధించడంలో తేజ ఆధ్యాపకులు కృత కృత్యులు అయ్యారని తెలియజేశారు. సోమిరెడ్డి గారు మాట్లాడుతూ పిల్లలు బాల్యాన్ని ఆస్వాదించాలని ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించాలని తెలిపారు. ఈరోజు కార్యక్రమంలో దాదాపు 450 బహుమతులు విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం. అప్పారావు,ఇన్చార్జులు ఝాన్సీ, రామ్మూర్తి, సోమనాయక్ ,వెంకటేశ్వర్లు, రమేష్ ,గోపి, ఎస్. ఎన్. ఆర్ , ఎస్ .ఎల్ .ఎన్, వీరభద్రం,ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తేజ పాఠశాలలో వార్షిక బహుమతుల ప్రధానోత్సవం
Related Posts
జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్
TRINETHRAM NEWS జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్ గోదావరిఖని : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని నిత్యంప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం కాలంతో పోటీపడుతూ ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్ట్ లు తమ ఆరోగ్యంపై…
బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి
TRINETHRAM NEWS బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి Trinethram News : Telangana : మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఓ…