TRINETHRAM NEWS

11నుంచి అయోధ్యలో వార్షికోత్సవాలు..!!

అయోధ్య: అయోధ్య ఆలయంలో రామ్‌ లల్లా ప్రతిష్ఠాపనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జనవరి 11వ తేదీన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అభిషేకం జరిపించనున్నారు. ప్రతిష్ఠా ద్వాదశి వార్షికోత్సవాలు 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి.

రామాలయం సమీపంలోని ‘అంగద్‌ తిల’లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా సీఎం యోగి ప్రారంభించనున్నారు.

ప్రముఖ గాయకుల భక్తి గీతాల రికార్డును కూడా ఆయన విడుదల చేస్తారని అధికారులు చెప్పారు. అంతేకాకుండా, అయోధ్యలోని లతా చౌక్, జన్మభూమి పథ్, శ్రింగార్‌ హాట్, రామ్‌ కీ పైడీ, సుగ్రీవ ఫోర్ట్, చోటి దేవ్‌కాళి ప్రాంతాల్లో యువ కళాకారులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గీతా లాపన వంటివి ఉంటాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చెప్పారు. ఆలయ గర్భగుడి వద్ద ‘శ్రీరామ్‌ రాగ్‌ సేవ’కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా దేశ వ్యాప్తంగా ఉన్న సాధువులు, భక్తులకు ఆహ్వానాలు పంపామని వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App