Andhra Pradesh Deputy CM Pawan Kalyan went to Bangalore
Trinethram News : బెంగళూరు : అక్కడ కర్ణాటక అటవీశాఖ మంత్రితో భేటీకానున్నారు..
ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని కూడా కోరనున్నారు.
ఇటీవల అటవీశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు.
ఏనుగుల గుంపు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం చర్చకు వచ్చింది.
ఈ సందర్భంలో.. పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఏనుగులు అవసరమని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో రెండు కుంకీ ఏనుగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు.
కుంకీ ఏనుగుల కొరత ఉందని.. అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నామని చెప్పారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు.
వెంటనే స్పందించిన పవన్ కళ్యాన్.. తానే స్వయంగా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరతానని చెప్పారు..
చెప్పినట్లుగానే బెంగళూరుకు వెళ్లారు. ఏపీకి ఆరు కుంకీ ఏనుగుల్ని ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App