TRINETHRAM NEWS

Interesting development at the time of swearing in.. Pawan’s key request for PM Modi!

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం(జూన్ 12న) ప్రమాణం చేశారు.అలాగే ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో జనసేనాని పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్ళిపోతున్న ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రిక్వెస్ట్ చేశారు.

అన్నయ్య కలుస్తారని పవన్ కోరగా..మోడీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లారు. మెగా బ్రదర్స్‌ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. వారితో ప్రజలకు అభివాదం చేయించి ఇద్దరినీ అభినందించారు. చిరంజీవి..పవన్ గడ్డాన్ని పట్టుకుని మోడీ ముందు తన తమ్ముడిని అభినందిస్తుండగా రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Interesting development at the time of swearing in.. Pawan's key request for PM Modi!