TRINETHRAM NEWS

An in-depth investigation into the suicide of junior college student Teja

  • : రాష్ట్ర బీసి సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖా మంత్రి వర్యులు సవితమ్మ
  • : సోమవారం రాత్రి అనంతపురం జిజిహెచ్ లో విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించిన మంత్రి సవితమ్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా ఎస్పీ పి. జగదీష్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, తదితరులు

Trinethram News : అనంతపురం, ఆగస్టు 26 :

  • జూనియర్ కళాశాల విద్యార్థి తేజ ఆత్మహత్యపై లోతుగా విచారణ జరపాలని రాష్ట్ర బీసి సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖా మంత్రి వర్యులు సవితమ్మ పోలీసులను ఆదేశించారు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి తేజ అనంతపురం అర్బన్ కళాశాల బాయ్స్ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకుని మృతిచెందగా, సోమవారం రాత్రి అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అత్యవసర విభాగంలో పోస్టుమార్టం కోసం వచ్చిన విద్యార్థి మృతదేహాన్ని మంత్రి సవితమ్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా ఎస్పీ పి. జగదీష్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, తదితరులు పరిశీలించారు.
  • ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి తేజ మృతికి గల కారణాలు తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. హాస్టల్ విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది తో కలసి ఆత్మహత్యకు గల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయం కింద ప్రభుత్వం తరఫున మట్టి ఖర్చులకోసం ఒక లక్ష రూపాయలను విద్యార్థి కుటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు. రేపటి రోజున పోస్టుమార్టం తర్వాత నివేదిక అందజేస్తామన్నారు. విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
  • ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ విద్యార్థి ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే నివేదికను తీసుకోవడం జరిగిందన్నారు. గతంలో ఏమైనా జరిగిందా, విద్యార్థి ఇబ్బంది ఎవరికైనా ఏమైనా తెలియజేశారా అనేది క్షుణ్ణంగా జిల్లా ఎస్పీ ప్రాథమికంగా విచారణ చేయడం జరిగిందన్నారు. విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం జరగాల్సి ఉందని, ఈరోజు రాత్రి కావడంతో పోస్టుమార్టం చేయలేదని, మార్చరీలో రేపు ఉదయం సన్రైజ్ అయిన వెంటనే విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థి తండ్రి ఇక్కడికి రావడం జరిగిందని, ఆయనను పరామర్శించడం జరిగిందన్నారు. ప్రతి అంశంపై విచారణ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిసి వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డీఎస్పీ ప్రతాప్ కుమార్, విద్యార్థి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

An in-depth investigation into the suicide of junior college student Teja