![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-19.10.07.jpeg)
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 6 : జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ ఆదేశాల మేరకు బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష చూపి నిధుల కేటాయింపు లో అన్యాయం చేసినందుకు మరియు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి నెరవేర్చకుండా దేశం లో నిరుద్యోగ రేటు పెరగడానికి కారణమైన బీజేపీ ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తూ,ఈరోజు హైదరాబాద్ లోని గాంధి భవన్ దగ్గర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
కావున ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర యువజన నాయకుడు జక్కిడి శివచరణ్ రెడ్డి,మేడ్చల్ జిల్లా యువజన అధ్యక్షుడు బొమ్మక అజయ్ మరియు కూకట్పల్లి నియోజకవర్గం యువజన అధ్యక్షుడు ఎండి సలీం,మరియు కె పి హెచ్ బి డివిజన్ అధ్యక్షులు డి.రంగస్వామి,అల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ కరీం, ఫతేనగర్ డివిజన్ అధ్యక్షులు చందు,యువజన కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు మరియు కార్యకర్తలు,ఈ నిరసన కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![against budget](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-19.10.07-1024x986.jpeg)