గడ్డం వంశీకృష్ణ నాయకత్వంలో అంబేద్కర్ గౌరవార్పణ నిరసన కార్యక్రమం
పార్లమెంటులో అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా
త్రినేత్రం న్యూస్ పెద్దపల్లి ప్రతినిధి
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తమ పార్లమెంట్ పరిధిలోని మందమర్రి బెల్లంపల్లి మంచిర్యాల లక్షిట్ పేట్ ధర్మపురి ధర్మారం సెంటర్లలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నిరసన తెలిపారు.
వంశీకృష్ణ ప్రధాన వ్యాఖ్యలు అంబేద్కర్ కించపరిచే వ్యాఖ్యలను అమిత్ షా తక్షణమే ఉపసంహరించుకోవాలి. దళిత బహుజనుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నేతకు ఉందని స్పష్టం చేశారు. వంశీకృష్ణ పిలుపునకు స్పందించి వివేక్ వంశీ కాక అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి ఉన్నట్లు తన చర్యల ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు. వంశీకృష్ణ దళితుల హక్కుల కోసం ఆవేదన వ్యక్తం చేస్తూ, అంబేద్కర్ గౌరవాన్ని కాపాడే తన నాయకత్వాన్ని మరోసారి ప్రదర్శించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App