TRINETHRAM NEWS

విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంబోత్సవ ఏర్పాట్లు.

నగరంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా

రాష్ట్ర ప్రభుత్వం వారు విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతివనాన్ని ది.19.01.2024 తేదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్న నేపధ్యంలో ఈ రోజు ది.12.01.2024 తేదిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.యస్ గారు బందర్ రోడ్డులోని స్వరాజ్య మైదానం మరియు పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేయు భద్రతా ఏర్పాట్లను, కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన భద్రత చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు స్వరాజ్య మైదానం నందు చేయు భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., గారితో పాటు, డిప్యుటీ పోలీస్ కమీషనర్లు శ్రీ విశాల్ గున్ని ఐ.పి.ఎస్. గారు, శ్రీమతి అజిత వేజెండ్ల ఐ.పి.ఎస్.గారు, మునిసిపల్ కమీషనర్