TRINETHRAM NEWS

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలకు కృషి: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు..

ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా పలు శుభకార్యాల వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికలను మరియు తదితర కార్యక్రమాల ఆహ్వాన పత్రికలను అందజేశారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLC Shambhipur Raju