Trinethram News : బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల బలోపేతానికి అమ్మ ఒడి పథకం ఎంతగానో దోహదపడుతుందని ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం శాసనసభ్యులు కోన రఘుపతి గారి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అన్ని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా అమ్మ ఒడి పథకాన్ని అందించడం ద్వారా చాలావరకు తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గిందన్నారు. అంతే కాకుండా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ కొరకు ఒక కార్యాలయాన్ని నిర్మించుకుంటామని, దానికోసం స్థలాన్ని కేటాయించాల్సిందిగా బాపట్ల శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారిని విన్నవించారు. ఆయన దీనిపై సానుకూలంగా స్పందించి స్థలాన్ని కేటాయిస్తానన్నారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, పనిచేస్తున్న స్టాఫ్, యాజమాన్యాలు వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట కార్యదర్శి కరీం, పేరాల వెంకట సురేష్ పోలిరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ భవనానికి స్థలాన్ని కేటాయించండి
Related Posts
AITUC : యానిమేటర్ ఆర్పి లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
TRINETHRAM NEWSయానిమేటర్ ఆర్పి లకు ఉద్యోగ భద్రత కల్పించాలి యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి డిమాండ్. యానిమేటర్ల పై రాజకీయ వేధింపుల ఆపాలి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు. నగరంలో యానిమేటర్లు ప్రదర్శన Trinethram News…
Suicide : తుపాకితో కాల్చుకుని రూరల్ ఎస్సై ఆత్మహత్య
TRINETHRAM NEWSతుపాకితో కాల్చుకుని రూరల్ ఎస్సై ఆత్మహత్య తేదీ : 31/01/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకులో రూరల్ ఎస్సై మూర్తి పోలీస్ స్టేషన్లో తుపాకుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రూరల్ ఎస్సైగా పనిచేస్తున్న…