TRINETHRAM NEWS

అట్రాసిటీ కేసులో అలహాబాద్ హై కోర్ట్ సంచలన తీర్పు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇంట్లో గానీ ఇతరులు ఎవరూ లేనప్పుడు కులపరంగా చేసే దూషణలకు ఈ చట్టం వర్తించదని స్పష్టం చేసింది.

పబ్లిక్ గా అందరూ చూస్తున్నప్పుడు కులాన్ని ఉద్దేశించి దూషిస్తే అప్పుడు కేసు పెట్టుకోవచ్చని తెలిపింది.

కులం పేరుతో తనను తిట్టారని ఓ వ్యక్తి పిటిషన్ వేయగా కోర్ట్ ఏమని దూషించారు.? ఆ సమయంలో ఎవరెవరు వున్నారనే విషయాన్ని వెల్లడించనందుకు ఆ కేసును కొట్టివేసింది.