నాన్ ఆదివాసి పార్టీలన్నీ 1/70 చట్టానికి వ్యతిరేకమే – ఆదివాసి పార్టీ
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : నాన్ ఆదివాసీ పార్టీలన్ని 1/70 చట్టానికి, వ్యతిరేకమేనని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు మండిపడ్డారు. అధికార మార్పిడి జరిగినప్పుడల్లా అధికారపక్షం ప్రతిపక్షంగా, ప్రతిపక్షం అధికార పక్షంగా మారినప్పుడు అధికారంలో ఉన్నవారు, అధికార మదంతో తోలు మందమై ఆదివాసీల మీద రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
ప్రతి పక్షం, ప్రజల పక్షమని అప్పటి వరకు చేసిన పాపాల్ని కడిగేసుకొందామని,ఆదివాసీలను రక్షించేందుకు ఎంతకైనా సిద్ధమని ప్రగల్బాలు పలుకుతారు.ఓట్ల పండుగలో కుడి ఎడమ,ఎడమ కుడి అయ్యి అధికార మార్పిడి జరిగి అప్పటి వరకు అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలోకి,ప్రతిపక్షం అధికారంలోకి రాగానే,అధికార దాహాంతో ఆదివాసీల మీద దాడులు చేస్తుంటారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇలానే జరుగుతుంది. గతంలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రేస్ పార్టీ 1/70 చట్టానికి, వ్యతిరేకంగా గిరిజనేతరులు గృహ నిర్మాణం కోసం ఒకటిన్నర సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని,బోయ వాల్మీకిలను,బొంతి ఒరియాలను గిరిజన జాబితాలో కలపడానికి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం,సుప్రీంకోర్టు జిఓ 3ని రద్దు చేస్తే,సమయానికి స్పందించకపోవడం జరిగిందని,అప్పుడు వైయస్సార్ కాంగ్రేస్ పార్టీ నేతలు ఒక్కరు కూడా మాట్లాడలేదు.
రాజకీయాలలో సచ్చిలురు ఎవరు,అధికార మదంతో ఒకరు,అధికార దాహం కొరకు మరొకరు,నవ్విపోదురగా నాకేటి సిగ్గు అన్నట్లు వ్యవహారిస్తున్నారని,ఎదుటి పక్షానికి విమర్శ చేయడానికి అర్హత ఉండేలా ఉంటేనే విమర్శ చేయాలి.ప్రస్తుతం అధికారంలో ఉన్న తెదేపా నేత, అసెంబ్లీ స్పీకర్ తన నోటికి అదుపులేకుండా,అధికార మదంతో,ఆదివాసీల చట్టమైనా 1/70 ని సడలించాలంటే కూటమి ఆదివాసీ నేతలు నోర్లు మెదుపరెందుకని,ఆదివాసీ సమాజం ఆపదలో ఉంటే మాట్లాడరెందుకు,అయ్యన్న పాత్రుడు నియోజకవర్గంలో కూడా ఆదివాసీలు ఎక్కువగానే ఉన్నారని తేడా వస్తే పాడేరు,అరకు నియోజకవర్గాల్లాగా నర్సీపట్నంలో తెదేపాని ఓడించడానికి ఆదివాసీలు కంకణం కట్టుకుంటారని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App