TRINETHRAM NEWS

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ

Trinethram News : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో టాలీవడ్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబం భేటీ అయ్యింది. కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిసేందుకు అక్కినేని నాగార్జున, అమల, చైతన్య, శోభిత ధూళిపాళ్ల పార్లమెంటుకు వెళ్లారు. కాగా, హీరో నాగార్జున గతంలో పలుమార్లు ప్రధాని మోదీని కలిశారు. ఇటీవల టాలీవుడ్ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా కురిపించారు.

భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసిన కృషిని ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర కొనియాడారు. మోదీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నాగ చైతన్య కూడా మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ బుక్ లాంచ్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని నాగార్జున కోరగా ఆవిష్కరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Akkineni family met PM Modi