ఆగనీ ప్రైవేటీకరణ
(విశాఖ ఉక్కు కర్మగారాన్ని ప్రైవేటీకరణ దుందుడుకు చర్యలను ఖండన)
అల్లూరి సీతారామరాజు జిల్లా జనవరి 16 త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్
ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసి జిల్లా కన్వీనర్ రామారావు దొర.
ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మగారం ఉద్యోగుల బలవంతపు వీఆర్ఎస్ తో ప్లాంట్ ప్రైవేటీకరణకు మరో ముందడుగుపడిందని, ప్రత్యకంగా, పరోక్షంగా ప్లాంట్ పై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలపై తీవ్రప్రభావన్నీ చూపానుందని, ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి, అల్లూరి సీతారామరాజు జిల్లా కన్వీనర్ రామారావు దొర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నెల 8వ తారీకున విశాఖ పర్యటించినకు వఛ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్కు కర్మగారం ప్రైవేటీకరణకు బ్రేకు వేస్తారని అందరు భావించిన, ప్రధానితో సహా కూటమి నాయకులెవరు కనీసం మాట్లాడకపోగా, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగిసిన మూడో రోజుకు (జనవరి 11) ప్లాంట్ ఉద్యోగులు స్వచ్చంద పదవి విరమణ (వీఆర్ఎస్)కు ప్రతిపాదన ముందుకు తెచ్చరన్నారు.
ప్రభుత్వరంగా సంస్థలు బలోపేతం చేయవలసిన పాలకులు, తమ సొంత మనసులైన ఆదాని, అంబనీల, వ్యాపార సంస్థలు బలోపేతం చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగా బలహీన పరుస్తున్నారని విమర్శించారు. పబ్లిక్ సెక్టర్సని ప్రైవేట్ పరం చేయడం వలన ఎస్టి, ఎస్సి, ఓబిసి వంటి రిజర్వేషన్లు పై ఆధారపడ్డ కులాలకు తీవ్రమైన నష్టం చేస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధారంగా సుమారు రెండు వేల ఆదివాసీ కుటుంబాలు ప్రత్యక్షంగా ఉద్యోగాలు పొందగా, ఉమ్మడి విశాఖ ఏజెన్సీ నుండి సుమారు ఎనిమిది వందల మంది ఉద్యోగాలు పొంది, ఆర్ధిక ప్రయోజనం పొందరన్నారు. వీరంతా మొదటి తరం ఉద్యోగులు కావడంతో డబ్బు, ఆస్తులు సంపదించడంకన్న తమ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని భావించి, ఉన్నత చదువులపై దృష్టి పెట్టారన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదన్న భరోసాతో తమ పిల్లలకు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఐఐటి వంటి చదువులతో పాటు. గ్రూప్-1, గ్రూప్-2, సివిల్స్ మొదలైన కాంపిటేటివ్స్ పై పెట్టుబడులు పెడుతున్నారని, మరి కొందరు తమ పిల్లలను విదేశాలకు సైతం పంపించారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ,ఇటీవల తీసుకువచ్చిన బలవంతపు స్వచ్ఛంద పదవి విరమణ, ప్రతిపాదనలు ప్లాంట్లో పనిచేస్తున్న ఆదివాసి ఉద్యోగులపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తుందని, సంక్షేమ ప్రభుత్వాలుగా చెప్పుకుంటూ ఇంత నీచానికి దిగజారడం తాగడాన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App