TRINETHRAM NEWS

కాసేపట్లో సొంత జిల్లాకు సీఎం జగన్

జిల్లాలో మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన…

వివరాలు…23 వ తేదీ…

ఉదయం 10.30 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 11.05 గంటలకు గోపవరం వద్దనున్న సెంచురీ పై ఇండస్ట్రీస్ హెలి ప్యాడ్ కు చేరుకుంటారు.

బద్వేలు లో…

అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 11.25 గంటలకు సెంచురీ ప్లై ఇండస్ట్రీస్ వద్దకు చేరుకుంటారు.

11.25 నుంచి 11.30 గంటల వరకు ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

11.45 నుంచి 11.55 గంటల వరకు మీడియం డెన్సిటీ ఫైబర్ ప్లాంట్ కంట్రోల్ రూమ్ ప్రారంభో త్సవంలో పాల్గొంటారు.

11.55 నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు హై ప్రెజర్ ల్యామినేట్ ప్లాంట్ ప్రారంభిస్తారు.

12.15 గంటల వరకు అక్కడి ఉద్యోగులతో ముచ్చటిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన బయ లుదేరి

12.20 గంటలకు హెలిప్యాడ్ చేరుకుంటారు..

12.25 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 12.45 గంటలకు కడపలోని రిమ్స్ హెలిప్యాడ్ కు చేరుకుంటారు.

కడపలో…

” 12.50 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 12.55 గంటలకు డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్దకు చేరుకుని 1.15 గంటల వరకు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

1.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.20 గంటలకు డాక్టర్ వైఎస్సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ వద్దకు చేరుకుని 1.35 గంటల వరకు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

■అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.40 గంటలకు డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ బ్లాక్ వద్దకు చేరుకుని 1.55 గంటల వరకు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

” ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 2.00 గం టలకు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు..

■అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 2.25 గంటలకు వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి చేరుకుని 2.40 గంటల వరకు అక్కడి ఫ్లడ్ లైట్స్ ప్రారంభిస్తారు.

” అక్కడి నుంచి బయలుదేరి 2.50 గంటలకు కలెక్టరేట్ కు చేరుకుంటారు. దివ్యాంగులకు ట్రై స్కూటర్ల పంపిణీలో 2.55 గంటల వరకు గడుపుతారు.

■2.55 గంటల నుంచి 3.00 గంటల వరకు అగ్నిమాపకశాఖకు రెస్క్యూ ఎక్విప్మెంట్ అందజేస్తారు. “

3.00 నుంచి 3.10 గంటల వరకు పునర్మించిన కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ను సందర్శిస్తారు.

▪ 3.20 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 3.25 గంటలకు అంబెడ్కర్ సర్కిల్ చేరుకుంటారు.

■ 3.25 నుండి 3.35 వరకు రోడ్డు వెడల్పు పనులను ప్రారంభిస్తారు.

▪ 3.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.38 గం టలకు వై జంక్షన్ కు చేరుకుం టారు. 3.48 గంటల వరకు అక్కడి అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు..

■అనంతరం బయలుదేరి 3.55 గంటలకు కోటిరెడ్డిసర్కిల్ కు చేరుకుని 4.05 గంటల వరకు అక్కడ అభివృద్ధి చేసిన పనులను ప్రారంభిస్తారు.

▪ అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయ లుదేరి 4.10 గంటలకు ఏడురోడ్ల కూడలి వద్దకు చేరుకుని అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచే మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ హాకీ కోర్టుకు శంకుస్థాపన చేస్తారు.

▪ 4.20 గంటలకు ఏడురోడ్ల కూడలి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.35 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.

■ 4.45 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 5.00 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్కు చేరుకుంటారు.

■5.10 కు అక్కడి నుంచి బయలుదేరి 5.15 కు గెస్ట్హౌస్కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.