TRINETHRAM NEWS

నగరంలో పారిశుధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ,

రామగుండం, జనవరి17 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తెలిపారు.

శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణ ఇతర సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

విటల్ నగరలో ప్రమాదకరంగా పగుళ్లు చూపిన వంతెన పరిశీలించిన అదనప కలెక్టర్ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గౌతమి నగర్ లోని కాంపోస్టు యార్డ్, డ్రై రిసోర్సెస్ సెంటర్ ను పరిశీలించారు. తడి చెత్తతో కంపోస్ట్ తయారీ పటిష్టంగా జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

అనంతరం ఆదనపు కలెక్టర్ పారిశుధ్య వాహన చోదకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ మాట్లాడుతూ, ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు క్షేత్రస్థాయిలో ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు. సేకరించిన చెత్తను ఎక్కడపడితే అక్కడ పడ వేయకుండా డంపింగ్ యార్డ్ కు రవాణా చేయాలని అన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులకు ప్రకారం పారిశుధ్య కార్మికులకు ఇవ్వవలసిన ఉపకరణాలు దుస్తులు వగైరా వెంటనే అందజేయాలని అధికారులను అదుపు కలెక్టర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రామలింగ, ఈఈ రామన్, సానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సునీల్ రాథోడ్, పర్యావరణ ఇంజనీరింగ్ మధుకర్ తదితరులు అదనపు కలెక్టర్ వెంట ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App