ధరణి అప్లికేషన్ లు పెండింగ్ ఉండకుండా చూడాలి అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్
*పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు
పాలకుర్తి తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
పాలకుర్తి, అక్టోబర్ -19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ధరణి అప్లికేషన్ లు పెండింగ్ ఉండకుండా చూడాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ పాలకుర్తి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాలకుర్తి మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేసి పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.
పాలకుర్తి మండలం లో మీసేవ కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సకాలంలో వాటిని జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ తనిఖీల్లో తహసిల్దార్ జ్యోతి,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App