Additional Collector GV Shyam Prasad Lal made grand arrangements for the Independence Day celebrations
పెద్దపల్లి, ఆగస్టు -09 : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలో నిర్వహించు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. స్వాతంత్ర్య వేడుకల డయాస్ , సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆర్ &బీ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, దీనిని అప్రమత్తంగా నిర్వహించాలని అన్నారు.
పెద్దపల్లి పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఏఎన్ఏం ఆధ్వర్యంలో వైద్య బృందాలచే శిభిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్య అతిథి అందించే సందేశం రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా ఆగస్టు 12 నాటికి అందజేయాలని అన్నారు.
స్వాతంత్ర్య వేడుకల అవసరమైన మేర త్రాగు నీటి క్యాన్లు ఆర్.డబ్ల్యూఎస్ అధికారులు మున్సిపల్ కమిషనర్ సమన్వయంతో ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ప్రాదాన్యత అంశాలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది ప్రశంసా పత్రాలు అందజేసేందుకు ప్రతిపాదనలు ఆగస్టు 12 లోపు పంపాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో పెద్దపల్లి ఆర్.డి.ఓ బి.గంగయ్య, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App