ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి అదనపు కలెక్టర్ డి.వేణు
పెద్దపల్లి, డిసెంబర్ 09: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులకు తెలిపారు.
సోమవారం ప్రజావాణి సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు ప్రజల దరఖాస్తులను స్వీకరించారు.
పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన బొంత పూజిత సింగరేణి ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ క్రింద తమ గ్రామాన్ని తీసుకుందని, తాను తమ అమ్మమ్మ ఊరు తుర్కల మద్దికుంట కు వచ్చి గత ఆరు సంవత్సరాలు గడిపామని, తన పై చదువుల కోసం తనకు ఆదాయ కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాలు అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని అన్నారు.
సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూరు గ్రామానికి చెందిన బి.సతీష్ ఎంపీడీవో కార్యాలయం నందు గల దుకాణ సముదాయం నందు 1 రూమ్ జీవనోపాధి కోసం కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా సుల్తానాబాద్ ఎంపిడిఓ కు రాస్తూ పరిశీలించి అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అంతర్గాం మండలం బ్రాహ్మణ పల్లి గ్రామానికి చెందిన
పి. రాజేశం తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నరేందర్, కలెక్టరేట్ హెచ్ విభాగం సూపరింటెండెంట్ జగదీశ్వర్ రావు,జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App