Actions to benefit the beneficiaries of Indira Mahila Shakti Schemes
త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను సాధించి లబ్దిదారులకు లబ్ది చేకూరేలా చర్యలు తీసుకవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారులను మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశించారు.
గురువారం ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమాలలో భాగంగారాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న 12 అంశాల పై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సంఘాల సభ్యులు, సాధారణ పెట్టుబడి సమూహాలు, సూక్ష్మ సంస్థలు ద్వారా 7 కొత్తయూనిట్లైన బ్యూటిషియన్, మైక్ అండ్ లైటింగ్, డెకరేషన్, ఫుడ్ క్యాంటీన్, ఫోటోగ్రఫి, ఈవెంట్ మేనేజ్మ్మెంట్, కన్స్ట్రక్షన్ యూనిట్ల టార్గట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈయూనిట్లను కలిపి గ్రూపులుగా ఏర్పాటు చేసి గ్రూప్ టార్గెట్లను పూర్తి చేయాలన్నారు. వీటిలో ఫుడ్ క్యాంటీన్లకు స్థలం సమస్య ఉన్నట్లయితే మోబైల్ ఫుడ్ కోర్టులను తీసుకోవాలన్నారు.ఈ పనులన్నింటిని నవంబరు చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ అధికారి సాంబశివరావు, మెప్మా పిడి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App