ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 సంవత్సర నూతన డైరీ ఆవిష్కరించిన ఏసీపీ మడత రమేష్, మరియు సిఐ ఇంద్ర సేన రెడ్డి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
2025 నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కొత్త ఉత్తేజాన్ని ఏర్పరుచుకోవాలని, అనుకున్న పనులన్నీ సకాలంలో జరగాలని రామగుండం కమిషనరేట్ లోని గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలోని వారి ఛాంబర్లో ఏసిపి మడత రమేష్, మరియు ఖని 1టౌన్ సిఐ గురువారం రోజున నూతన సంవత్సరం సందర్భంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ముద్రించిన 2025 డైరీని మద్దెల దినేష్ అధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగిందన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజలకు మంచి జరగలని, మంచి సమాజం కోసం పాటు పడుతున్న ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.
అదే విధంగా అనాధలకు అభాగ్యులకు, నిరాశ్రయులకు నిరంతరం సేవ చేయడం గొప్ప విషయమని సమాజంలో ప్రజలకు అండగా నిలవడం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని వారన్నారు. ఇంకా ఈ డైరీ ఆవిష్కరణలో స్వచ్ఛంధ సంస్థల ఐక్య వేదిక నిర్వాహకులు అధ్యక్షులు మంచికట్ల దయాకర్, ఉపాధ్యక్షులు చంద్రకళ, కంది సుజాత, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యులు రరేణికుంట్ల నరేంద్ర, నవీన్ కుమార్, గంగరపు సురేష్, కొమ్మ చందు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App