
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం
అర్హులైన యువతీ, యువకులు అందరూ దరఖాస్తు చేసుకోవాలి
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోడిమే వంశీ
తెలంగాణ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా, కనీ విననీ ఎరుగని రీతిలో 6000 కోట్లతో సుమారు ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెట్టడం ఎంతో శుభ పరిణామం అని దీనిలో భాగంగానే ప్రభుత్వం నుంచి ఈ నెల 17వ తారీఖు నుండి వచ్చేనెల 5వ తారీఖు వరకు దరఖాస్తులను అర్హులైన యువతీ,యువకుల నుండి స్వీకరించనుందని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోడిమే వంశీ ఓ ప్రకటనలో తెలిపారు. క్యాటగిరీ1 కింద రూ. లక్ష వరకు రుణం అందించి 80 శాతం రాయితీ ఇస్తుంది. క్యాటగిరీ2 కింద రూ.
లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలను మంజూరు చేసి 70 శాతం రాయితీ కల్పిస్తుంది అని వివరించారు. క్యాటగిరీ3 కింద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రుణాలను అందజేసి 60 శాతం రాయితీ ఇవ్వనుందని పేర్కొన్నారు. అర్హులైన యువతీ యువకులు అందరూ ఈ మంచి సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ సేవా కేంద్రాలలో నిర్ణీత సమయంలో వచ్చేనెల 5వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలియచేస్తున్నా ములకలపల్లి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోడిమే వంశీ.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
