Trinethram News : ప్రియురాలు తనను దూరం పెడుతోందన్న కక్షతో ఓ యువకుడు (27) ఆమెను కత్తితో పొడిచి చంపాడు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. ఈ ఘటనలో బాధితురాలి మేనకోడలు కూడా గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ, ఆమె మేనకోడలు, మేనల్లుడితో కలిసి నిన్న టైలరింగ్ షాపు నుంచి ఇంటికి తిరిగి వస్తోంది. అదే సమయంలో అక్కడ కాపుకాసిన నిందితుడు ఆమెపై కత్తితో దాడిచేశాడు. విచక్షణ రహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె మేనకోడలికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.మృతురాలు, నిందితుడు ఒకరికొకరు తెలుసునని పోలీసులు తెలిపారు. ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తుండడంతో ఆమె అతడికి దూరంగా ఉంటోంది. ఆమె తనను దూరం పెడుతుండడాన్ని జీర్ణించుకోలేకపోయిన నిందితుడు కాపుకాసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు…
దూరం పెడుతోందని.. పట్టపగలు అందరూ చూస్తుండగానే యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
Related Posts
స్థానిక సంస్థల ఎన్నికల తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
TRINETHRAM NEWS స్థానిక సంస్థల ఎన్నికల తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..!! Trinethram News : తెలంగాణలో మరో సమరానికి సీఎం రేవంత్ సై అంటున్నారు. పథకాల అమలుకు ఈ నెల 26 ముహూర్తంగా ప్రకటించారు. దీంతో, స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ…
రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు
TRINETHRAM NEWS రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు రెండు పంటలకు గాను రూపాయలు 12000 రైతు భరోసా అందిస్తున్నందుకు ఆయా గ్రామాల్లో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్…