భద్రాచలం: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం బుధవారం ప్రారంభమైంది. ఆలయ ప్రవేశానికి మొత్తం 3 మార్గాలు ఉండగా.. ఉచిత దర్శనం దారిలో ఇప్పటికే ఇత్తడి తాపడం ఉంది. అంతరాలయంలో బంగారు వాకిలి గతంలోనే ఏర్పాటు చేశారు. వీటి మధ్యలో ఉన్న ముఖ మండపానికి దాదాపు 100 కిలోల వెండితో తాపడం తయారు చేసి వాటిని ఈ మార్గానికి అమర్చారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్తపతి దండపాణి సారథ్యంలో శిల్పకళ ఉట్టిపడే విధంగా దీన్ని తయారు చేశారు. కోవెలలో ఉన్న 70 కిలోల పాత రజతానికి తోడు హైదరాబాద్‌కు చెందిన దాత మరో 30 కిలోల వెండిని అందించారు. స్వామి వారి దశావతార ప్రతిరూపాలతో ఏర్పాటు చేసిన వెండి వాకిలి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
భద్రాద్రిలో ఇకపై శుక్రవారం ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆ రోజు మూల విరాట్‌కు స్వర్ణ కవచాల అలంకరణ ఉంటుంది. అంతరాలయంలో పూజలు చేయించే వారు వెండి, బంగారు వాకిలి గుండా లోపలకు ప్రవేశించి మూలమూర్తులను దర్శించుకుంటారు. ఇప్పుడు శని, ఆదివారాల్లో రద్దీ నెలకొంటోంది. భవిష్యత్తులో శుక్రవారం కూడా సందడి పెరిగే అవకాశముంది.
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం
Related Posts
Kartika Deepotsavam : నవంబరు 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
TRINETHRAM NEWS నవంబరు 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం Trinethram News : తిరుపతి, 2024 నవంబరు 12: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 18వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం…
శ్రీ క్రోధి నామ సంవత్సరం
TRINETHRAM NEWS శ్రీ గురుభ్యోనమఃమంగళవారం,నవంబరు12,2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షంతిథి:ఏకాదశి మ12.21 వరకువారం:మంగళవారం(భౌమవాసరే)నక్షత్రం:ఉత్తరాభాద్ర తె3.26 వరకుయోగం:హర్షణం సా5.32 వరకుకరణం:భద్ర మ12.21 వరకు తదుపరి బవ రా11.11 వరకువర్జ్యం:మ2.00 – 3.29దుర్ముహూర్తము:ఉ8.20 – 9.05మరల రా10.27…