సమగ్ర కుటుంబ ఇంటింటా సర్వేలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
*సమగ్ర కులాల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు తెలుసుకునేందుకు సర్వే
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో సమగ్ర కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినబీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
పెద్దపల్లి, నవంబర్ -01: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే విజయవంతం చేయాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు.
శుక్రవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ , బీసీ కమిషనర్ బాల మాయ దేవితో కలిసి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియం హాల్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సమగ్ర కులాల స్థితిగతుల పై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష పాల్గొన్నారు.
అభిప్రాయాల సేకరణ కార్యక్రమం అనంతరం బీసి కమిషన్ చైర్మన్ నిరంజన్ పాత్రికేయులతో మాట్లాడుతూ బృహత్తరమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, సమగ్రంగా అన్ని కులాల వారు ఎంతమంది, ఏ స్థితిగతులలో ఉన్నారో తెలుసుకుంటుందని అన్నారు. బీసీలకే పరిమితం కాకుండా ఓసిలు, ఎస్సీ, ఎస్టీ ,మైనారిటీ, సంచార జాతుల ఆర్థిక సామాజిక పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేపట్టామని అన్నారు.
బీసీ కమిషన్ ఎవరి ఒత్తిడులకు గురి కాకుండా ఉన్నది ఉన్నట్లు నివేదిక రూపొందించి సమర్పిస్తామని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో అభిప్రాయాలు తెలియజేసిన వారు క్షేత్రస్థాయిలో జరిగే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొని ఎన్యుమరేటర్లకు వివరాలు తెలియజేయాలని చైర్మన్ సూచించారు.
జనాభాలో ఆయా వర్గాల జనాభా శాతం నిర్ధారించే బాధ్యత వారి పైనే ఉంటుందని, త్వరలో ప్రారంభమయ్యే ఇంటింటి సర్వే లో ప్రజలు పాల్గొని వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ఈ విషయాన్ని ఏ కుల సంఘం విస్మరించరాదని అన్నారు. రాజకీయ పార్టీల విధి విధానాలు వేరైనప్పటికీ ఈ కార్యక్రమంలో ఆటంకాలు,అపోహలు సృష్టించే ప్రయత్నం చేయవద్దని ఆయన కోరారు.
కర్ణాటక లో చేపట్టిన సర్వే వివరాలు 10 సంవత్సరాలు గడిచిన బయట పెట్టలేదని , తెలంగాణలో మాత్రం పారదర్శకంగా సర్వే చేపడుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రితో సమావేశమై దీనిపై చర్చించిన సమయంలో అడ్వకేట్ జనరల్ సైతం పాల్గొన్నారని తెలిపారు. ప్రస్తుతం తాము ఒక పార్టీకి చెందిన వారం కాదని అన్నారు.
కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని అన్నారు. న్యాయ నిపుణుల సలహాల మేరకు బీసీ కమిషన్ కార్యక్రమాలు యాథా విధిగా కొనసాగు తాయని చైర్మన్ తెలిపారు ఉదయం నుంచి అనేక మంది ప్రతినిధులు వారి విజ్ఞప్తి తెలియజేశారని, కులాల స్థితిగతుల గురించి కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చారని అన్నారు.
బీసీ కమిషన్ ఆహ్వానం మేరకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న 4 జిల్లాల కలెక్టర్లకు కమిషన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల గోడు కలెక్టర్లు నేరుగా తెలుసుకోవడం మంచిదని, సమాజంలో ఉన్న అనేక కులాల గురించి మనకు తెలియదని, ఇటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో అన్నారు.
బీసి కమిషన్ సభ్యులు మాట్లాడుతూ, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ప్రజా ప్రతినిధులు రవీందర్ సింగ్, చెల్లా స్వరూప, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతిక మొదలగు ప్రజా ప్రతినిధులు గెస్ట్ హౌస్ కు వచ్చి తమను కలిసి అభిప్రాయాలు తెలియ జేశారని అన్నారు.
బిసి కుల గణన తెరమీదకి వచ్చిన తరువాత బీసీ కులాలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓసీలలోని అన్ని కులాలకు సంబంధించి లెక్కలు తేలాలని సర్వే జరుగుతుందని, అందులో భాగంగా బీసీ కమిషన్ సంబంధించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ గురించి వచ్చినప్పటికీ ప్రజల స్థితిగతుల గురించి అందించిన అభిప్రాయాలను నోట్ చేసుకోవడం జరిగిందని అన్నారు.
కులాలకు సంబంధించిన జనాభా, జీవన స్థితిగతుల వివరాలను రాబోయే 3,4 రోజులలో ప్రారంభమయ్యే కులాల సర్వేలో స్పష్టంగా అందజేయాలని సూచించారు. ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభిప్రాయాలు, డిమాండ్స్ నెరవేరాలంటే క్షేత్రస్థాయిలో జరిగే సర్వేలో క్రియాశీలకంగా పాల్గొనాలని, ఎన్యుమరేటర్లకు సహకరించి సమగ్ర సమాచారం అందించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ లు కోయ హర్ష, సందీప్ కుమార్ ఝ, బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App