A strong law for the implementation of Operation Budameru: Chief Minister Chandrababu
Trinethram News : Andhra Pradesh : ఆపరేషన్ బుడమేరును ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందుకోసం పటిష్ట చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. విజయవాడలోని కలెక్టరేట్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ గ్రాబర్స్, పొలిటికల్ సపోర్టుతో ఆక్రమణలకు పాల్పడ్డ వారికి బుద్ధి చెప్పే పటిష్టమైన చట్టం ఉంటుందన్నారు. కొంత మంది ఆక్రమణదారుల వల్ల లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు.
ఇటువంటి వరదలు విజయవాడ పట్టణానికి మళ్లీ రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు నిర్వరామంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
గవర్నరుతో సిఎం భేటీ
గవర్నరు ఎస్ అబ్దుల్ నజీర్‌తో సిఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, బుడమేరుతో సంభవించిన వరదలు, సహాయక చర్యలతోపాటు రాష్ట్రానికి జరిగిన నష్టం సుమారు రూ.6,880 కోట్లు ఉండొచ్చని కేంద్రానికి నివేదిక పంపినట్లు గవర్నరుకు సిఎం వివరించారు. వీరిద్దరి భేటీ 45 నిమిషాలకు పైగా జరిగింది. వరద బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగమంతా రేయింబవళ్లు పనిచేసి పెద్దయెత్తున సహాయక పునరావాస చర్యలు చేపట్టినట్లు సిఎం తెలిపారు.
సిఎం చంద్రబాబు శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యలను ఆర్మీ ఇంజినీరింగ్ విభాగం ప్రశంసించిందన్నారు. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. నాలుగు రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్ అక్కడే ఉండి ప్రత్యేకంగా దృష్టి సారించి, బుడమేరు గండ్లును పూడ్చే పనిని పూర్తి చేయగలిగారన్నారు. సోమవారం అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సిఎం ఆదేశించారు.
ఈ మేరకు కలెక్టర్లతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలేరు రిజర్వాయర్‌కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందని, ప్రాజెక్టు స్టోరేజీ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపాలని, ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా ప్రత్యేక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App