యువకులకు వలపు వల….
మందమర్రి మండల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మందమర్రి లో అరెస్టు అయిన దంపతులు
మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి పేర్కొన్న వివరాల ప్రకారం.
మందమర్రి యాపల్ ఏరియాకు చెందిన ఒక యువకుడికి ఈ సంవత్సరం మార్చి నెలలో ఒక గుర్తు తెలియని నెంబర్ నుండి ఫోన్ రాగా అతను లిఫ్ట్ చేశాడు. ఒక ఆడ వ్యక్తి చనువుగా ఫోన్లో మాట్లాడగా నమ్మిన యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు అని మాయమాటలు చెబుతూ ఆ యువతి తనకు డబ్బు అవసరం ఉందని మళ్లీ ఇస్తానని నమ్మించి ఫోన్ పే ద్వారా పలుదపాలుగా 4600 రూపాయలను ఆమె అకౌంట్లోకి వేయించుకున్నది. ఆ యువకునితో చనువు పెంచుకొనుటకు తన ఫోటోలను కూడా పంపించి ఆ సంబంధాన్ని కొనసాగించింది.ఆమెను తన డబ్బులు ఇవ్వమని గట్టిగా అడిగినందుకు, ఆ యువతి అట్టి వ్యక్తి నెంబర్ను బ్లాక్ చేయగా, అ మహిళ యొక్క ప్రియుడు మందమర్రి కి చెందిన ఆ యువకుడికి ఫోన్ చేసి మళ్లీ ఆమెకు ఫోన్ చేస్తే పోలీసులకు పట్టిస్తానని, కేసులు పెట్టిస్తానని బెదిరించాడు, కేసు పెట్టకుండా ఉండాలంటే మళ్ళీ డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు, అందుకు భయపడిన యువకుడు ఫలుదపాలుగా మళ్లీ 85 వేల రూపాయల వరకు వారు చెప్పిన నెంబర్లకు ఫోన్ పే చేశాడు. అయినా కూడా ఇంకా అధిక మొత్తంలో డబ్బులు కావాలని డిమాండ్ చేయగా,మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశాడు ఇట్టి సంఘటనపై మందమర్రి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 120/2024 కేసు నమోదు చేశారు.
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం.శ్రీనివాస్ .ఐజి ఐపీఎస్ , మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్.ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఎసిపి రవికుమార్. పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దర్యాప్తు చేసి పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్న జంటను ఈరోజు మందమర్రి పోలీసులు పట్టుకున్నారు. ఈ విధంగా ఈ జంట చాలా మందిని మాయమాటలు చెబుతూ మోసం చేశారని తెలిసింది, కానీ ఎవరుకూడ ఫిర్యాదు ఇవ్వడానికి వెనుకంజ వేశారని, విధంగా మోసపోయిన వారు ఎవరు ఉన్నా కూడా ధైర్యంగా వచ్చి సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా గాని పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీస్ వారు సూచించారు.
ఇట్టి నేరస్థులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మందమర్రి సిఐ, ఎస్ఐ,హెడ్ కానిస్టేబుల్ అజయ్, రాము మరియు మహిళ హోం గార్డ్ ఉమ. లను బెల్లంపల్లి ఏసిపి. అభినందించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App