TRINETHRAM NEWS

సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర..!!

Trinethram News : న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై మరో భారం మోపింది. పెట్రో ధరలు తగ్గుతాయంటూ లీకులిస్తూ వస్తున్న బీజేపీ సర్కార్‌..
గ్యాస్‌ సిలిండర్‌ (LPG cylinder) ధరను మాత్రం పెంచింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిండర్‌పై మరో రూ.62 బాదింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1802కు చేరింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర జోలికి మాత్రం వెల్లకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.

తాజా పెంపుతో హైదరాబాద్‌లో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.2028కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1911.50, ముంబైలో రూ.1754.50, చెన్నైలో రూ.1964.50గా ఉన్నది. కాగా, వాణిజ్య అవవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధర గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.

ఇక డొమెస్టిక్‌ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో 14 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.803గా ఉండగా కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50, విజయవాడలో రూ.827.50గా ఉన్నది. హైదరాబాద్‌లో మాత్రం పై అన్ని నగరాల్లో కంటే అత్యధికంగా రూ.855కు లభిస్తున్నది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App