ఆన్లైన్లో పేకాట ఆడిన రెవెన్యూ అధికారి
Trinethram News : ఆంద్రప్రదేశ్ : అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి మలోల హాజరయ్యారు.
ఒక వైపు సమావేశం జరుగుతుండగా.. మరోవైపు మలోల ఆన్లైన్లో పేకాట ఆడారు.
పలు సంఘాల నేతలు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినా పట్టనట్లు వ్యవహరించారు.
ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…