A regional party used the Tirumala laddu for their financial interests
Trinethram News : తిరుపతి : 21-9-2024,
మరో ప్రాంతీయ పార్టీ శ్రీవారి లడ్డును రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోంది.
తిరుమల లడ్డులపై చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా, ఇతరులు మాట్లాడి ఉంటే బాగుండేది.
ఏపీలోని రెండు ప్రాంతీయ పార్టీలు ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కొరకు తిరుమల పవిత్రత దెబ్బతీసే విధంగా వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీ హయాంలో, బాపిరాజు టీటీడీ చైర్మన్ గా ఉన్న రోజుల్లో తిరుమల కొండ గురించి, లడ్డూల గురించి ఎలాంటి వివాదం రాలేదు.
ప్రాంతీయ పార్టీల పాలనలో టిటిడి ఉద్యోగులు నలిగిపోతున్నారు. చాలా బాధతో విధులు నిర్వహిస్తున్నారు.
ఏ పాపం ఎరుగని టీటీడీ ఉద్యోగస్తులకు షోకాజు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.
టీటీడీ ఉద్యోగస్తులపై ఈగ వాలినా మేము ఊరుకోము. ఉద్యోగస్తులందరూ చక్కగా డ్యూటీలు చేస్తున్నారు.
ఎలుకను పట్టేందుకు, కొండను తవ్వాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డు పై సిబిఐ విచారణను నేను అంగీకరించను.
టీటీడీవో శ్యామలరావు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూశాను. చాలా భయంతో మాట్లాడుతున్నాడు.
ఒక్క గుజరాత్ లోనే కాకుండా, తమిళనాడు, కర్ణాటక, త్రివేండ్రంలలో చాలా ల్యాబ్ లు ఉన్నాయి. వాటిల్లో లడ్డూల టెస్టింగ్ చేయించాలి.
వడమాల పేటలో టీటీడీ ఉద్యోగస్తులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి, అలిపిరి వద్ద టిటిడి ఉద్యోగస్తులకు ఇళ్ళ స్థలాలు కావాలని డిమాండ్ చేస్తున్నాను.
అలిపిరి వద్ద 400 ఎకరాలు టిటిడి భూములు ఉన్నాయి. టిటిడి భూములు టిటిడి ఉద్యోగస్తులకు ఇవ్వాలి.
టిడిపి వంద రోజుల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.
సూపర్ సిక్స్ అమలు కాలేదు.
ఉచిత బస్సు ఎక్కేందుకు మహిళలు ఎదురుచూస్తున్నారు.
టిడిపి ఎమ్మెల్యేల్లో అవినీతి మొదలైంది. టీటీడీ దర్శనాలకు సిఫార్సు లేఖలు ఇచ్చి, డబ్బులు వసూలు చేస్తున్నారు.
చింతమోహన్ మాజీ మంత్రి (కాంగ్రెస్ పార్టీ)
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.