Trinethram News : ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు గిద్దలూరు కు చెందిన దూదేకుల ఖాదర్ వలీగా పోలీసులు గుర్తించారు. మొదట తీవ్రంగా గాయపడ్డ దూదేకుల ఖాదర్ వలిని కుటుంబ సభ్యులు గిద్దలూరు లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.కానీ అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
Related Posts
CM Chandrababu : స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు
TRINETHRAM NEWS స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు Trinethram News : కడప జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కోసం అందరూ కలిసికట్టుగా…
పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు
TRINETHRAM NEWS పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు Trinethram News : Andhra Pradesh : స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి (64) పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ (68) అతనికి సేవలు…