TRINETHRAM NEWS

బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలోనే మగబిడ్డకు జన్మనిచ్చిన ముస్లిం మహిళ

ఉత్తర ప్రదేశ్: జనవరి 22
చారిత్రక అయోధ్య రామ మందిరంలో బాల రాముడు ఈరోజు కొలువుదీరాడు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ క్రతువుతో అయోధ్య రామ మందిరం ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రామ మందిరంలో హారతిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని పలురంగాలకు చెందిన ప్రముఖులు 4వేల మందికిపైగా హాజరయ్యా రు. లక్షలాదిగా మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు.

ఇది ఇలావుండగా, దేశ వ్యాప్తంగా అయోధ్యలో బాల రాముడు కొలువు దీరిన సమయంలోనే తమ బిడ్డలకు జన్మనివ్వాలని పలువురు తల్లులు పట్టుబడ్టారు.

అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలోనే తమ పిల్లలకు జన్మనిచ్చేలా చూసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంతోపాటు పలు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తమకు రామ మందిరం ముహూర్తంలోనే సిజేరి యన్ చేయాలని డాక్టర్లను కోరడంతో వారు అలాగే చేశారు.ఈ క్రమంలో రాముడు కొలవయ్యే సమయానికే మహారాష్ట్ర థానే నగరంలో ఓ 42 ఏళ్ల ముస్లిం మహిళ సోమవారం మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఐటీ రంగంలో పనిచేస్తున్న సదురు మహిళకు జనవరి23న డెలివరీ జరగాల్సి ఉన్నా.. రామ మందిర ప్రారంభోత్సవం రోజున ఆమె కోరడంతో డెలివరీ చేశారు. హిందూ ముస్లిం సమైక్యతను చాటుతూ ఆ నవజాతి శిశువుకు రామ్ రహీం అని నామకరణం కూడా చేశారు

ఈ సమయంలో జన్మించిన పిల్లలు శ్రీరాముడి లక్షణాలతో జన్మిస్తారని తల్లులు భావించారు. మరోవైపు, శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలోనే మరికొందరు తల్లులు తమ పిల్లలకు జన్మనిచ్చారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 15 మంది శిశువులు జన్మించారు. వీటిలో 11 సాధారణ ప్రసవాలు కాగా.. మిగిలినవారికి సిజేరియన్ ద్వారా కాన్పులు చేసినట్లు వైద్యులు తెలిపారు…