క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 191 ఎన్టీఆర్ నగర్ లో పాస్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు ఈరోజు స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్ కట్ చేసి వారికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినంను పురస్కరించుకుని నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో,భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ 🎄శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 191 ఎన్టీఆర్ నగర్ ప్రెసిడెంట్ కృష్ణ, కాలనీ వాసులు ప్రేమ్ కుమార్, మైఖేల్,ఉపేందర్, మల్లేష్, నర్సింహా, పవన్, శ్రీనివాస్, మహేందర్, మోహన్, పాండు తదితరులు పాల్గొన్నారు.