TRINETHRAM NEWS

కమీషనర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎ.ఐ.టి.యు.సి. నాయకులు

కార్పోరేషన్ లో పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి .

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమస్యల ను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ & ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఎ.ఐ.టి.యు.సి.) రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో కమీషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏసురత్నం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో యేసు రత్నం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పోరేషన్లో పారిశుధ్ధ్య విభాగములో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరీశీలించి పరిష్కరించాలని కమీషనర్ ను డిమాండ్ చేయడం జరిగిందని ఆయన అన్నారు.

ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో జి.ఓ. 60 ప్రకారము బిల్ కలెక్టర్ & కంప్యూటర్ ఆపరేటర్లకు రూ॥ 19,500/- మరియు రూ॥ 22,750/-లు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన ప్రకారము జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వారికి కనీస వేతనం రూ॥ 26,000/-లు గా చెల్లించుటకు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపర్చాలని, అలాగే కార్మికులకు పి.ఎఫ్. జమ చేయడం లేదని , కనుక వెంటనే అమలు చేయాలని, డ్రైవర్లకు, బిల్ కలెక్టర్లకు, పంప్ ఆపరేటర్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు జి.ఓ. 60 ప్రకారము టెక్నికల్ వేతనాలు చెల్లించాలని, వారికి సబ్బులు, నూనెలు, బట్టలు, టవల్స్, గ్లౌజులు, రెయిన్ కోట్ లు తదితర సామాగ్రిని ఇవ్వాలని, అలాగే పారిశుద్ధ్య కార్మికులందరికి జి.ఓ. ప్రకారము రావలసిన సంవత్సరానికి 15 రోజుల లీవులు అమలు చేయాలని, ఎన్నికల సమయంలో పని చేసిన కార్మికులందరికి ఎన్నికల డబ్బులను ఇప్పించాలని ఏఐటియుసి డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు.

అదేవిధంగా ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.గౌస్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల, ఉద్యోగుల కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు, లేనిచో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు లింగయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A.I.T.U.C gave a petition