Trinethram News : హైదరాబాద్:మార్చి 29
ఇండ్ల మధ్య ఉన్న స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమా దం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ పరిధిలోని రహదారిలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ శంషాబాద్ షాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రియాంక గ్యాస్ గోడౌన్ పక్కన ఉన్న ఓ భారీ స్క్రాప్ గోడౌన్‌లో శుక్రవారం ఉదయం ఒక్క సారిగా మంటలు చెలరే గాయి.
దీంతో దట్టమైన పొగ పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించడం తో ఇండ్ల నుంచి పరుగులు తీశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు లు ఇండ్లు ఖాళీ చేస్తున్నారు ఫైరింజన్ల సాయంతో మంట లను ఆర్పే ప్రయత్నం చేస్తు న్నారు..