TRINETHRAM NEWS

తేదీ : 12/01/2025.
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
ఎన్టీఆర్ జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, మిస్సమ్మపేటలో ఉన్న సిద్ధార్థ జూనియర్ కళాశాల లో 2009
టు 2014. సంవత్సరం చదువుకున్న విద్యార్థిని, విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ లో ఎలా ఉన్నారో ఆ విధంగా మారిపోయారు. మంచి మనసు పలకరింపుతో, ప్రతి ఒక్కరి ఇంట సిరిసంపదలు, సంతోషం, కలిగి, ఎటువంటి అనారోగ్యం, కష్ట నష్టాలు రాకుండా ఉండాలని, దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ , అనురాగ, ఆప్యాయతతో అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటూ వారు ఇప్పుడు చేసే వృత్తిలో మరియు కుటుంబంలో ఎలా ఉన్నారు అనేది ప్రతి ఒక్కరూ వాళ్లకు పాటలు చెప్పేన ఉపాధ్యాయులు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా భోగి, సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కాలేజీలో ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది.
ఉపాధ్యాయులను పుష్ప గుచ్చాలతో మరియు శాలువాలతో సత్కరించి పాదాభివందనాలు చేశారు. చదువుకునే రోజుల్లో క్రమశిక్షణతో కూడిన విద్య మీరు మాకు అందించడం వల్ల మేము పై స్థాయికి ఎదిగి ఉద్యోగ, వ్యాపార రీత్యా లో మా జీవితాన్ని కొనసాగిస్తున్నామని పూర్వ విద్యార్థిని విద్యార్థులు అనడం జరిగింది. అత్తమామలను, తల్లితండ్రుల వలె కోడలు చూసుకోవాలని, మీ పిల్లలకు మీరే పూర్తి బాధ్యత వహించాలని, ఉపాధ్యాయులు వారి వారి యొక్క మాటల్లో చెప్పారు.
అనంతరం విందుభోజనాలు ఎవరికి ఎటువంటి లోటుపాటు రాకుండా ఏర్పాటు చేశారు. ఆకాశం పుట్టింది సూర్య చంద్ర నక్షత్రాల కోసం, చెట్టుపుట్టింది పూల పండ్ల కోసం మనం పుట్టింది మన స్నేహం కోసం అని అన్నారు. సిద్ధార్థ కాలేజీ ఫౌండేషన్ ప్రతి ఒక్క విద్యార్థి ఎదుగుదలని , ఈ పాఠశాల, కళాశాలలో చదువుకున్న విద్యార్థులు కొన్ని వేలమంది ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఉద్యోగంలో తమ ప్రతిభను కనబరుస్తున్నారని యాజమాన్యం చెప్పడం జరిగింది. ముందు ముందు కొంతమంది కాకుండా అందరూ మళ్లీ ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడానికి ప్రయత్నం చేయాలని పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అన్నారు.
ఈ కార్యక్రమంలో యం.సురేష్, మహేష్, వెంకీ, రాఘవేంద్ర , రమేష్,, రవి, మోహన్, సిహెచ్ ,సురేష్, టి, సురేష్ సింధు రమ్య, స్వాతి పూర్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App