TRINETHRAM NEWS

వాసిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ మరియు లైఫ్ లైన్ ఫౌండేషన్, విజ్ఞాన్ స్కూల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత హెల్త్ క్యాంపు ప్రారంభించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ 14వ డివిజన్ లో వాసిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ మరియు లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆర్గనైజింగ్ విత్ సపోర్ట్ ఆఫ్ విజ్ఞాన్ స్కూల్స్ వారి ఆధ్వర్యంలో నిజాంపేట్ విజ్ఞాన్ స్కూల్ లో మెగా హెల్త్ క్యాంప్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ సేవలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ రాజేశ్వరి చౌదరి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఈ క్యాంపులో బీపీ, షుగర్, ఈసీజీ, టుడి ఈకో, కంటి పరీక్షలు, క్యాల్షియం టెస్ట్, దంత పరీక్షలు, పలు రకాలైన వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు .ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగ పరచుకోగలరని తెలిపారు. అలాగే ఉచిత హెల్త్ క్యాంప్ సేవలు నిర్వహిస్తున్న వాసిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్, లైఫ్ లైన్ ఫౌండేషన్, విజ్ఞాన్ స్కూల్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డాక్టర్ వాసిరెడ్డి, లైఫ్ లైన్ ఫౌండేషన్ సభ్యులు రామ రావు, డాక్టర్ స్వాన్ ప్లాస్టిక్ సర్జన్, తదితరులు పాల్గొన్నారు.