TRINETHRAM NEWS

లాస్ ఏంజెల్స్‌లో అగ్నిప్రమాదం.. రూ.300 కోట్ల విలువైన భవనం దగ్ధం.. వీడియో వైరల్

Trinethram News : లాస్ ఏంజెల్స్‌ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అగ్ని దావానంలా వ్యాపిస్తోంది. అడవిలో మంటలు చెలరేగి క్రమంగా రాష్ట్రంలోకి అడుగు పెట్టి బీభత్సం సృష్టిస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో 300 కోట్ల రూపాయల విలువైన భవనం బూడిదైంది. వాస్తవానికి అగ్ని ప్రదమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ఒకటి ప్రధానంగా వార్తల్లో నిలిచింది. కోట్లాది వ్యూస్ ను సొంతం చేసుకుంది.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్‌లో అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో అడవుల్లో మంటలు చెలరేగాయి. దీని కారణంగా అనేక నివాస ప్రాంతాలు కూడా అగ్ని ప్రమాదం బారిన పడ్డాయి. కోట్ల విలువైన ఆస్తులు బూడిదయ్యాయి. ఈ మంటలు హాలీవుడ్ హిల్స్‌ను కూడా చుట్టుముట్టాయి. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ తారలు చాలా మంది తమ ఇళ్లను వదిలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ నేపధ్యంలో ఓ వీడియో బయటకు వచ్చింది. దీనిలో ఒక విలాసవంతమైన భవనం మంటలతో చుట్టుముట్టబడి కనిపిస్తుంది. ఈ భవనం విలువ సుమారు రూ.300 కోట్లుగా చెబుతున్నారు.

మీడియా నివేదికల ప్రకారం ఈ భవనం అమెరికాలోని ప్రధాన ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్‌గా తెలుస్తోంది. ఈ వీడియోను చూసిన ప్రజలు షాక్ తిన్నారు. ఎందుకంటే మంటలు మొత్తం భవనాన్ని చుట్టుముట్టడంతో.. కొద్దిసేపటికే భవనం కాలి బూడిదయ్యంది. ఈ దృశ్యం చూసిన తర్వాత ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదమా.. లేక ఎవరైనా అణుదాడి చేశారా అనిపిస్తోందని అంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App