TRINETHRAM NEWS

A device that diagnoses malignant brain cancer in an hour!

Trinethram News : అత్యంత ప్రమాదకరమైన గ్లియోబ్లాస్టోమా అనే మెదడు క్యాన్సర్ ను వేగంగా గుర్తించే సరికొత్త మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.వారు కొత్తగా రూపొందించిన పరికరంతో కేవలం గంట వ్యవధిలోనే వ్యాధిని నిర్ధారించవచ్చని చెబుతున్నారు. రక్తపరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేసేందుకు ఓ ఆటోమేటెడ్ పరికరాన్ని అమెరికాలోని నాట్రదామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉందని త్వరలోనే అందరకీ అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A device that diagnoses malignant brain cancer in an hour!