TRINETHRAM NEWS

గోదావరిఖనిలోని 33వ డివిజన్లోని 5వ ఇంక్లైన్ సమీపంలోని కల్వర్టు శిదిలావస్థకు చేరుకొని ప్రజలకు ప్రమాదకరంగా మారింది.

ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకముందే నూతన కల్వర్టు నిర్మించాలి, కల్వర్టును సందర్శించి, ఇన్చార్జి కమిషనర్ అరుణ దృష్టికి తీసుకెళ్లిన మద్దెల దినేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ప్రాంతంలోని రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 33వ డివిజన్లో 5వ ఇంక్లైన్ సమీపంలో ఒక కల్వర్టు శిథిలావస్థకు చేరి చాల ప్రమదకరంగా మారిందని డి హెచ్ పి ఎస్ జిల్లా కన్వినర్ మద్దెల దినేష్ పేర్కొన్నారు.
ఆదివారం రోజున స్థానిక 33వ డివిజన్లోని ఐదవ ఇంక్లైన్ సమీపంలో మజీద్ కాంప్లెక్స్ ప్రక్కన కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని కూలిపోయిన కల్వర్టు ను మద్దెల దినేష్ సందర్శించి స్థానిక నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ అరుణ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.
అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ స్థానిక ప్రజలు అనేక రోజుల నుండి అటు వైపు నుండి వెళ్ళాలంటే వాహనదారులు కానీ పాదచారులు కానీ జంకుతున్నారని, అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదని, డివిజన్లో రోజు వందలాది మంది ప్రజలు ఇదే రహదారి వెంట కల్వర్టును మిది నుండే వాహన దారులు,పాదచారులు వెళ్తుంటారన్నారు కల్వర్టు క్రింద అతి పెద్ద మోరి ఉన్నందున ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు.
నూతన కల్వర్టు నిర్మించకపోతే భారి ప్రమాదం తప్పదని ప్రజలకు ప్రాణ నష్టం జరుగుతుందని, కావున ప్రజల సౌకర్యార్ధం కొరకు ఎలాంటి ప్రమాదం జరగకముందే శిథిలావస్థకు చేరిన కల్వర్ట్ 33వ డివిజన్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన కల్వర్టు నిర్మించాలని దినేష్ అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఇంచార్జీ కమిషనర్ అరుణ కోరడం జరిగిందని దినేష్ తెలిపారు.
అరుణ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసి కాంట్రాక్టర్ను పంపించడం జరిగిందని త్వరలో కల్వర్టును నిర్మిస్తామని ఇంచార్జ్ కమిషనర్ హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App