హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, మలక్‌పేట ఎమ్మెల్యే బలాలపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. భూమి విషయంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని రూ.7 కోట్లు తీసుకుని మోసం చేశారని మల్కాజిగిరికి చెందిన చింతల యాదగిరి ఫిర్యాదు చేశారు. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రూ.7 కోట్లకు ఒప్పదం కుదిరిందని పేర్కొన్నారు. విడతల వారీగా రూ.4 కోట్లు, రూ.3 కోట్లు చెల్లించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. కానీ, కోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని న్యాయవాది వెంకటరమణను.. యాదగిరి కోరారు. రూ.కోటి ఇచ్చారని, మిగలిన మొత్తం ఇవ్వకుండా మలక్‌పేట ఎమ్మెల్యే బలాలా, మరో వ్యక్తితో కలిసి బెదిరింపులకు దిగినట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు సీపీఎస్ పోలీసులను ఆశ్రయించగా.. ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…..
సీనియర్ న్యాయవాది మలక్‌పేట ఎమ్మెల్యేపై కేసు నమోద
Related Posts
సిఎస్ఆర్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
TRINETHRAM NEWS సిఎస్ఆర్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … Trinethram News : Medchal : ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగంలోని ప్రతికరణ 51ఎ ప్రకారం ప్రాథమిక…
భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చింది మహాత్మా గాంధీ అయితే తెలంగాణకు స్వాతంత్రాన్ని తెచ్చిన తెలంగాణ జాతిపిత కేసిఆర్ : శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్
TRINETHRAM NEWS భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చింది మహాత్మా గాంధీ అయితే తెలంగాణకు స్వాతంత్రాన్ని తెచ్చిన తెలంగాణ జాతిపిత కేసిఆర్ : శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్…. Trinethram News : Medchal : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు…