TRINETHRAM NEWS

నెల్లూరు జిల్లా

Trinethram News : నెల్లూరు నగరం లోని మినీ బైపాస్ లో బాలాజీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 6వ తేదీ జరిగిన భారీ దారి దోపిడీ కేసును 6రోజుల్లోనే చేదించి,సొమ్ము మొత్తం రికవరీ చేసి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

కూపి లాగి సాంకేతికత ఆధారాలతో, దోపిడి కేసును చేదించిన బాలాజీ నగర్ పోలీసులు….

9 మంది ముద్దాయిలు అరెస్ట్. 1758 గ్రాముల బంగారు నగలు, రూ.2,30,000/- ల రూపాయల సొత్తు మొత్తం విలువ సుమారు 90 లక్షల 58 వేల పాయలు రికవరీ

ముద్దాయిలు అందరూ తిరుపతి జిల్లాకు గూడూరు నియోజకవర్గంలోని గూడూరు,కోట తదితర ప్రాంతాలకు చెందిన వారే.

బంగారు నగలను ఒంటరిగా తీసుకు తీసుకు వెళ్ళి అంగళ్లకు వేసే వాళ్ళనే టార్గెట్ చేసిన వైనం

గూడూరు నుండి గత నెల రోజులుగా రక్కీ చేసి, పక్కా ప్రణాళికతో దోపిడీ చేసిన ముద్దాయిలు.

బృందాలుగా ఏర్పడి ముద్దాయిలను చాకచక్యంగా అరెస్టు చేసిన బాలాజీ నగర్ పోలీసులు..

పిర్యాదు ప్రకారం ముగ్గురు ముద్దాయిలు కూపీ లాగగా బయటపడిన 9 మంది ముద్దాయిలు

కేసు వివరాలు
2:1.Cr.No.06/2024 U/s 394 IPC of Balaji Nagar PS.

ముద్దాయిల వివరాలు

  1. బల్లి వెంకటేశ్వర్లు @వెంకటేష్, తండ్రి పోలయ్య, వయస్సు.32సం., కులం-మాల, శాంతి నగర్, గూడూరు టౌన్, తిరుపతి జిల్లా, N/O అన్నమేడు గ్రామం, నాయుడుపేట మండలం, తిరుపతి జిల్లా.
  2. బల్లి తిరుపాల్, తండ్రి బోడయ్య, వయస్సు 53 సం, కులం-మాల, 26/3/193, చంద్ర మౌళి నగర్, వేదాయపాలెం, నెల్లూరు, N/O అన్నమేడు గ్రామం, నాయుడుపేట మండలం, తిరుపతి జిల్లా
  3. బొచ్చు నాగేంద్రబాబు, తండ్రి నాగరాజు, వయస్సు. 26 సం, కులం-మాల, పున్నెపల్లి గ్రామం, ఓజిలి మండలం, తిరుపతి జిల్లా.
  4. కలపాటి సుబ్రహ్మణ్యం, తండ్రి కృష్ణయ్య, వయస్సు, 40సం, కులం- మాల, కొండాపురం గ్రామం, వాకాడు మండలం, తిరుపతి జిల్లా.
  5. వడ్డి జగదీష్, తండ్రి వెంకటేశ్వర్లు, వయస్సు, 20సం, కులం బెస్త, చిట్టేడు గ్రామం, కోట మండలం, తిరుపతి జిల్లా.
  6. ననిమేల నరేంద్ర, తండ్రి నరసింహులు, వయస్సు. 20సం, కులం ముత్తరాశి, చిట్టేడు గ్రామం, కోట మండలం, తిరుపతి జిల్లా.
  7. మణిమేల పాపయ్య, తండ్రి రమణయ్య, వయస్సు. 28సం, కులం ముత్తరాశి, చిట్టేడు గ్రామం, కోట మండలం, తిరుపతి జిల్లా.
  8. పెనేటి మన్షీప్ @చంటి, తండ్రి రమణ, వయస్సు.21సం, కులం మాల, కొత్త పాలెం, విద్య నగర్, కోట మండలం, తిరుపతి జిల్లా,
  9. కోనేటి వంశీ, తండ్రి వెంకటేశ్వర్లు, వయస్సు. 23 సం, కులం ముత్తరాశి, చిట్టేడు గ్రామం, కోట మండలం, తిరుపతి జిల్లా.

స్వాదీన పరచుకున్న సొత్తు

రూ.88,28,000/- విలువ చేసే సుమారు 1758 గ్రాముల బంగారు ఆభరణాలు, 2,30,000/- నగదు మొత్తం కలిపి 90,58,000/-

06.01.2023 న రాత్రి 10.15 గంటల సమయములో నెల్లూరు సిటీ మినీ బై పాస్ రోడ్డు జోయాలూకస్ సమీపములో గూడూరు లో బంగారు ఆభరణాలు లైన్ పై వేసి నగదు తీసుకొని తిరిగి మోటార్ సైకిల్ పై వస్తున్న పిర్యాదీ అయిన పబ్బతి హరి కోటేశ్వర రావుని మరియు అన్న చంద్ర శేఖర్ లను వెనుక బైక్ మీద ముగ్గురు ముద్దాయిలు ఫాలో అయ్యి వారిని కొట్టి కింద పడేలా చేసి వారి వద్ద ఉన్న బ్యాగు అందులో ఉన్న 1758 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు నగధును దోపిడి చేసి వెళ్ళినట్లు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనది.

నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ డా. కె. తిరుమలేశ్వర రెడ్డి, IPS.. గారి ఆదేశాల మేరకు, నెల్లూరు టౌన్

DSP శ్రీ D. శ్రీనివాస రెడ్డి గారి పర్యవేక్షణలో బాలాజీ నగర్ పి. యస్ ఇన్స్ పెక్టర్ శ్రీ L వీరా నాయక్ గారి ఆధ్వర్యంలో CCS CI-CH కోటీశ్వర రావు. CI- వేమా రెడ్డి గారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారి సాంకేతికత ఆధారంగా ముద్దాయిల అనవాలను గుర్తించి. దర్యాప్తు చేసి ముద్దాయిలని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 1758 గ్రాముల ములు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ముద్దాయి వెంకటేశ్వర్లు @వెంకటేష్ అను ముద్దాయి బంగారు షాపులో పనిచేసిన అనుభవం ఉండినందున అతను పథకం ప్రకారం 8 మంది ముద్దాయిలు అందరినీ ఒకటిగా చేర్చి, సుమారు ఒక నెల రోజులుగా గూడూరు నుండి రెక్కి చేసి కేవలం బంగారు ఆభరణాలను లైన్ పై వేసే వారి వద్ద నుండి దోపిడీ చేస్తే ఎక్కువ మొత్తంలో సులభ మార్గం లో డబ్బులు సంపాదించ వచ్చు అని కాపు కాసి మరీ దోపికికి పాల్పడినారు.

అభినందనలు:

ఈ కేసును చాకచక్యంగా చేధించిన నెల్లూరు టౌన్ DSP శ్రీ D శ్రీనివాస రెడ్డి గారిని, CCS DSP శ్రీ శివాజీ రాజు గారిని, బాలాజీ నగర్ పి. యస్ ఇన్స్పెక్టర్ శ్రీ L వీరా నాయక్ CCS CI-CH, కోటేశ్వర రావు, ట్రాఫిక్ CI- వేమా రెడ్డి గారిని, వారి ID పార్టీ సిబ్బంది ASI-గిరి CCS, HCS- KV సుధాకర్, CH రమేష్, కానిస్టేబుల్ లు A తిరుపతి, M హరి, OVS శివ ప్రసాద్, మస్తాన్, గోపాల్, గోపి, ARPC-సురేష్ మరియు టెక్ టీం కానిస్టేబుల్ ప్రసాద్ లను జిల్లా యస్.పి. గారు అభినందించి, రివార్డులు అందచేశారు…