TRINETHRAM NEWS

ఏపీలో కొత్తగా 88 పీహెచ్సీలు (ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు) ఏర్పాటు

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలకు గానూ 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో తెలిపారు.

ఈ 88 పీహెచ్సీలకు గానూ కర్నూల్ -9,పల్నాడు -7, తూర్పు గోదావరి, నెల్లూరు – 6 చొప్పున, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు 5 చొప్పున, కాకినాడ, పశ్చిమ గోదావరి, గుంటూరు, ఏలూరు నంద్యాల, చిత్తూరు, శ్రీ సత్య సాయి జిల్లాలకు 4 చొప్పున, విజయనగరం, కడప, ఎన్టీఆర్ జిల్లాలకు 2 చొప్పున, అల్లూరి విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, అన్నమయ్య జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున పీహెచ్సీలు మంజూరు అయినట్లు తెలిపారు.

పీహెచ్సీల్లో 72 మంది స్టాఫ్ నర్సులకు 68 మందిని,45 మంది వైద్యులకు 42 మంది వైద్యులను నియమించినట్లు చెప్పారు. జిల్లా అర్బన్ పీహెచ్సీల్లో 97 మంది స్టాఫ్ నర్సులకు 86 మందిని, 49 మంది వైద్యులకు 48 మందిని నియమించినట్లు వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App