అమరావతి లో ఉద్యోగులు , IAS / IPS అధికారులు , MLA / MLC లు నివాసాల కోసం కట్టిన ఇళ్లు 75% పూర్తి అయ్యాయి
జగన్ మోహన్ రెడ్డి ఆ పనులు ముందుకు తీసుకెళ్లినట్లు అయితే ఇంకో ఆరు నెలలలో పూర్తి అయ్యేవి. మహా అయితే ఇంకో 1000 కోట్లు ఖర్చు అయ్యేవి
ఇవి ఉద్యోగులు కి ఇచ్చినట్టు అయితే ప్రభుత్వానికి నెలకి HRA రూపములో 70 కోట్లు మిగిలేవి.
( ఈ 70 కోట్లు లెక్క ఎక్కడ నుంచి వచ్చింది అని మీరు అడగొచ్చు. రెండు రోజులు క్రితం ఏపీ ప్రభుత్వం నెలకి 70 కోట్లు అద్దె CRDA కి చెల్లిస్తునట్టు ఒక GO ఇచ్చింది )
అంటే 50 నెలలో ప్రభుత్వానికి 3500 కోట్లు ఆదాయం వచ్చేది. బిల్డింగ్లు పూర్తి అయ్యేవి.
వెయ్యి కోట్లు ఖర్చులకు పోను .. మిగిలిన 2500 కోట్లు తో secretariat భవనాలు కట్టి వుంటే జగన్ కి పేరు కూడా వచ్చేది. వాళ్ళ కాంట్రాక్టర్లకు పనులు కూడా దక్కేవి.