TRINETHRAM NEWS

నదిలో పడిపోయిన పెళ్లికి వెళ్తున్న వాహనం: 71 మంది మృతి?

Trinethram News : ఇథియోపియా : ఇథియోపియాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు ఒకటి నదిలో పడిపోవడం తో సుమారు 71 మంది మృతి చెందినట్టు తెలిసింది..

దక్షిణ సిడామా ప్రాంత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బోనా జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.వివాహ వేడుకకు వెళ్తున్నసమయంలో.. ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది,

చనిపోయిన వారిలో 68 మంది పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు తెలుస్తుంది, గాయపడిన వారిని బోనా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రాంతీయ కమ్యూనికేషన్స్ బ్యూరో సోమవారం ఉదయం ఒక ప్రకటనలో తెలియజేసింది.

ప్రభుత్వ యాజమాన్యం లోని ఇథియోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ప్రకారం, ప్రయాణికులం దరూ ఒక వివాహ వేడుక లకు వెళ్లి తిరుగు ప్రయాణం లో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు.

ఈరోజు ఉదయం నుండి అధికారులు నదిలో పడిపోయిన ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App