TRINETHRAM NEWS

Trinethram News : TS Election 2024 Voting Percentage Till 5 pm: తెలంగాణలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 61.16 శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో పోలింగ్ తక్కువ శాతం నమోదు అయింది. తెలంగాణలో 5 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. సిర్పూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంథని, భూపాలపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, ములుగు, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట లాంటి 13 సమస్యాత్మక కేంద్రాల్లో 4 గంటలకే పోలింగ్ ముగియడం తెలిసిందే. మిగిలిన 106 నియోజక వర్గాల్లో సాయంత్రం 6 గంటల పోలింగ్ జరుగుతుంది. ఆ సమయానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.