ఇందిరమ్మ ఇండ్ల కోసం సంచార ముస్లింలకు కూడా 6లక్షలు ఇవ్వాలి
-ఎస్సీ ఎస్టీల కంటే వెనకబడి ఉన్నాము అని సచ్చర్ కమిటీ తెలిపింది
-90% అప్పుల్లో ఉన్నారని,వడ్డీలు కట్టలేక పోతున్నారని కూడా తెలిపింది
తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షబ్బీర్ మీడియాతో మాట్లాడుతూ…..
తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్బంగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ఈ గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగాంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
మొదటి విడతలో 4.5 లక్షల మందికి ఎంపిక చేస్తున్నారు ఇందిరమ్మ ఇండ్ల లోఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత కల్పిస్తూ వారికి మరో లక్ష రూపాయలు అదనంగా ఇస్తాం అంటున్నారు, ఎస్సీ ఎస్టీల కంటే కూడా వెనకబడ్డ మాకు కూడా అదనంగా మరో లక్ష రూపాయలు ఇవ్వాలి, మా వెనకబాటు ను గుర్తించి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెనకబడ్డ వర్గాల్లో చేర్చడం జరిగింది, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో వేసిన సచ్ఛర్ కమిటీ, మరియు తెలంగాణ లో వేసిన సుదీర్ కమీషన్, రాములు కమిషన్లు ఇచ్చిన రిపోర్టులో చాలా స్పష్టంగా ఎస్సీ ఎస్టీల కంటే కూడా వెనకబడ్డరాని,పైగా సచ్చర్ కమిటీ సమాన అవకాశాల కోసం ప్రత్యేకంగా ఓ కమిషన్ ఏర్పాటు చెయ్యాలని, పేదల సమస్యను జాతీయ సమస్యగా గుర్తించి చర్యలు తీసుకోవాలని చూసించిన తెలిపిన విషయం తెలిసిందే కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో మాకు ప్రాధాన్యత కల్పించి, మరో లక్ష లేదా రెండు లక్షల రూపాయలు అదనంగా ఇచ్చినపుడే అందరికీ సమన్యాయం చేసినట్లు అవుతుంది, అని అన్నారు తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం స్థాపకులు మరియూ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షబ్బీర్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App