TRINETHRAM NEWS

510 Geo should be implemented for all

ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డిని కలిసిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

వరంగల్ జిల్లా
23సెప్టెంబర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కాకతీయ యూనివర్సిటీలో సెమినార్ హాల్లో విచ్చేసిన సందర్భంగా ప్రొఫెసర్ , ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డినీ శాలువాతో ఘనంగా సన్మానించి చేసిన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు.. 510 జీవో ను అందరికీ వర్తింప చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4000 వేల మందికి గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వం అన్యాయం చేసిందని వెంటనే 4000 మందికి న్యాయం చేసి 4000 మందికి 510 జీవో అమలు చేయాలని చర్యలు వెంటనే తీసుకోవాలని ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ఉ ద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం, బేసిక్ పే ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మా సమస్య పరిష్కరించాలని కోదండరాం కోరడం జరిగింది. మహిళా ఉద్యోగులకు 180 రోజులతో వేతనంతో కూడిన మేటర్నిటీ సెలవులు మంజూరు చేయాలని, హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ వర్తించే విధంగా తీసుకురావాలి, ఎన్ హెచ్ ఎం లో 65 సంవత్సరాలు నిండినవారికి రిటర్మెంట్ ప్రకటించి ఉద్యోగి ఒక నెల పెన్షన్ 25000 ఇచ్చేటట్టుగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది రెగ్యులరైజ్ చేసిన రాష్ట్రాలు హర్యానా, పంజాబ్ ,మహారాష్ట్ర జార్ఖండ్ ,మణిపూర్ మధ్యప్రదేశ్
ఆరాష్ట్రంలో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు కావున తెలంగాణ రాష్ట్రంలో కూడా జాతీయ ఆరోగ్య మిషిన్ లో ఉద్యోగులందని రెగ్యులర్ చేయాలని మేము కోదండరాం సార్ ,ప్రభుత్వని కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆచంట అభిషేక్ యువనేత మురళి మోహన్, ఓశపాక సందీప్ కుమార్, నూకల అంజి, పృధ్వి రాజ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

510 Geo should be implemented for all